
పయనించే సూర్యుడు మార్చి 24 ( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
క్షయ వ్యాధిపై అవగాహనకు ర్యాలీ మానవహారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా సోమవారం ఆత్మకూరు పట్టణంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రాథమిక వైద్యశాల నుండి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సోమశిల రోడ్డు సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి క్షయవ్యాధి పై అవగాహన తెలుసుకోమంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో ప్రాథమిక వైద్యశాల వైద్యులు. ఆశా వర్కర్లు .ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.