
పయనించే సూర్యుడు మే ఒకటి (పొనకంటి ఉపేందర్ రావు )
శుక్రవారం నాడు ఐటీడీఏ గురుకులం ఆర్ సి ఓ గా శ్రీమతి అరుణకుమారి బాధ్యతలు స్వీకరిస్తున్నారని గురుకులం పరిపాలన అధికారి నరేందర్ తెలిపారు.
ఐటీడీఏ కార్యాలయంలో గురుకులం ఆర్ సి ఓ గా పనిచేసిన నాగార్జున రావు మేడ్చల్ రంగారెడ్డికి బదిలీ అయ్యారని, 2024 జులై 22వ తేదీన గురుకులం ఆర్సిఓగా బాధ్యతలు చేపట్టి ఇప్పటివరకు ఆర్ సి ఓ గా పనిచేసిన నాగార్జున రావు గురుకులం సెక్రెటరీ సీతా లక్ష్మి ఉత్తర్వుల మేరకు మేడ్చల్ రంగారెడ్డికి బదిలీ అవ్వగా ఆయన స్థానంలో దమ్మపేట మండలం అంకంపాలెం గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అరుణ కుమారిని ఐటీడీఏ గురుకులం ఆర్సిఓగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె శుక్రవారం నాడు విధులలో జాయిన్ అవుతున్నారని ఆయన అన్నారు.