ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పయనించే సూర్యుడు ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి సూచనలతో కంచికచర్ల మండల తహసిల్దార్ సారధ్యంలో సోమవారం ఉదయం నుండి గండేపల్లి గ్రామంలో వ్యవసాయ మరియు ప్రైవేటు భూముల రీ సర్వే ప్రక్రియ మొదలైందిఈ సందర్భంగా కంచికచర్ల మండల తహసిల్దార్ పి.జాహ్నవి మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రీ సర్వే ప్రక్రియ జరుగుతుందని, గ్రామాన్ని బ్లాకులుగా విభజించి రీ సర్వే ప్రక్రియ చేపడతామని. ప్రతి బ్లాక్ లో 250 ఎకరాల అధిగమించకుండా సర్వే జరుగుతుందని తెలిపారుప్రతి బ్లాక్లో ఇద్దరు సర్వేయర్లు , వీఆర్వో, వీఆర్ఏ లను బృందంలా ఏర్పాటు చేయడమైనదని వివరించారు…వ్యవసాయ భూముల యజమానులను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి హద్దులు విషయంలో జాగ్రత్త పాటించనునట్లు వివరించారుయజమాని ఫీల్డ్ కు రాలేకపోతే వాట్సాప్ కాల్ లో హద్దులు చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు
రీ సర్వే జరిగిన తర్వాత రాజముద్ర తో కొత్త పాసుబుక్ క్యూఆర్ కోడ్ తో జారీ చేయడం జరుగుతుందని ప్రకటించారు…
గండేపల్లి గ్రామంలో మొదలైన రీ సర్వే ప్రక్రియ
RELATED ARTICLES