
రంగంలోకి మంత్రుల బృందం
పయనించే సూర్యుడు ఏప్రిల్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
హెచ్ సీయూ భూముల వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివాదంపై ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శనివారం నుంచి హెచ్ సీయూ కార్యవర్గం, స్టూడెంట్స్ యూనియన్, మేధావులు, పర్యావరణ వేత్తలతో సంప్రదింపులు జరపనుంది. అటు సీఎస్, అటవీ, రెవెన్యూ అధి కారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు.
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత భట్టి, శ్రీధర్ బాబు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశా లను పాటిస్తామన్నారు. అలాగే విద్యార్థులపై దాష్టీ కంగా వ్యవహరించరాదని పోలీసులకు తెలిపినట్లు వివరించారు. ఇక ఈ ముగ్గురు మంత్రులే ఇటీవల హెచ్ సీయూ ప్రతినిధులతో చర్చించారు. ఆ తర్వాతే హెచ్ సీయూ భూములు ఇంచు కూడా తీసుకోలేదని ప్రకటించారు. ఇప్పుడు ఆ ముగ్గురు మంత్రులే మరోసారి చర్చల కమిటీగా ఎంపికయ్యారు.నాలుగు వందల
కంచ గచ్చిబౌలిలో ఎకరాల భూమిని టీజీఐఐసీకి ప్రభుత్వం అప్పగించడంతో అక్కడ అభివృద్ధి పనులకు టీజీఐఐసీ శ్రీకారం చుట్టింది. చెట్లను కొట్టివేయడం ప్రారంభించింది. దీంతో విద్యార్థులు ఆందోళనలు చేశారు. ఆ భూములు వర్సిటీవని, చెట్లను నరకొద్దని, పర్యావరణాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చింది. 1975లో హెచ్ సీయూకి కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వ భూమిని కేటాయించింది. కానీ, భూ యాజమాన్య హక్కులు వర్సిటీకి బదిలీ చేయలేదు. రెవెన్యూ, అటవీ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ ఇరవై ఐదు లోని భూమిని ఏనాడూ అటవీ భూమిగా వర్గీకరించలేదు.
ఈ భూమి ఎప్పుడూ హెచ్ సీయూలో అంతర్ భాగం కాదని, గతంలో ఉన్న వివాదంపై హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం ఆ భూమిని టీజీఐఐసీ అభ్య ర్థన మేరకు ఆ సంస్థకు కేటాయించింది. ఈ భూమి లో భారీ పెట్టుబడులకు అవకాశం కల్పించడం వల్ల సుమారు 5లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. చెట్ల నరికివేతపై బీఆర్ఎస్, బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అభ్యం తరం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. దీంతో కేంద్ర అటవీశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. అటు కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాద పరిష్కార దిశగా దృష్టి సారించారు. దీనికోసం మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమి టీ నుంచే వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరపనుంది.