
(పయనించేసూర్యుడు అక్టోబర్ 17 రాజేష్)
ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ లోని కళాశాల ప్రాంగణంలో ఈరోజు అనగా రోజున గజ్వేల్ ఫైర్ స్టేషన్ అథారిటీ, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో భాగంగా ఫైర్ సేఫ్టీ అంశాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ మధు శ్రీవాత్సవ మరియు ఫైర్ స్టేషన్ ఆఫీసర్ గంటల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఫైర్ సేఫ్టీ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి ఫైర్ సంభవించిన సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకొని నష్ట నివారణ చేపట్టవలసిందిగా సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫైర్ సేఫ్టీ సిబ్బంది శ్రీనివాస్ గారు ఏ బి సి ఫైర్ నిర్వహణ పట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రత్యక్ష పూర్వకంగా చూపిస్తూ చేయడం వల్ల విద్యార్థిని విద్యార్థులు సరైన అవగాహన ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ మధు శ్రీవాత్సవ మాట్లాడుతూ ప్రత్యక్ష అవగాహన కలిగి ఉండి ఫైర్ సంభవించిన సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరిగింది మరియు ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ మంగతా నాయక్,ఎం.సంపత్ కుమార్, స్టూడెంట్ కౌన్సిలర్ బి.శివకుమార్ అధ్యాపకులు డి. రాజు సుధాకర్ ఎం. లక్ష్మీనారాయణ ఎస్. దయానంద్ ఈ. శ్రీనివాస్ రెడ్డి కే.శ్రీనివాస్ జె.భాగ్యమ్మ బీ. రమ్య మరియు ఫైర్ ఫైర్ సేఫ్టీ సిబ్బంది శ్రీనివాస్,సతీష్, సిద్ధిరాములు, రవికుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.