76వ జాతీయ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన…
ఎమ్మెల్యే రేవూరి 26-1-2025
పయనించే సూర్యుడు పరకాల ప్రతినిధి గొట్టే రమేష్:- పరకాల పార్టీ క్యాంప్ ఆఫీసులో 76వ జాతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభలో ఆమోదం పొందగా భారతదేశ స్వతంత్ర గణతంత్రంగా ఆవిష్కరించింది. మరియు 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పి టి సి సి ఉపాధ్యక్షుడు ద దొమ్మాటి సాంబయ్య పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటుకూరి దేవేందర్ రెడ్డి నడికుడ మండల అధ్యక్షులు దేవేందర్ గౌడ్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు చందుపట్ల రాజిరెడ్డి మరియు కుంకుమేశ్వర ఆలయ అధ్యక్షులు కొలుగూరి రాజేశ్వరరావు మాజీ ఎంపీపీ ఒంటేరు రామ్మూర్తి మరియు వార్డు కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.