గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నాగారం మున్సిపల్ కమీషనర్ భాస్కర్ రెడ్డి చైర్మన్ కోకుంట్ల చంద్రారెడ్డి
పయనించే సూర్యుడు జనవరి 26( మేడ్చల్ నియోజకవర్గం ప్రతినిధి మాధవరెడ్డి)”- మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ టీపీస్ కృష్ణ నగర్ కాలనీ ఫేస్ 1సర్కిల్ వద్ద జాతీయ జెండావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కమీషనర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతు మన దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులను కొన్నపుడే మనకు పూర్తి స్వాతంత్ర వచ్చినట్టు అని పేర్కొన్నారు, ఫేస్ 3 పోచమ్మ సర్కిల్ దగ్గర జెండా ఆవిష్కరణ చేసిన మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్ద,సమగ్ర రాజ్యాంగంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు.భారత రాజ్యంగం ద్వారా ఈ దేశంలోని అన్ని వర్గాలకు హక్కులు,ఆత్మగౌరవం లభించిందని ప్రశ్నించేతత్వం కూడా రాజ్యాంగం ద్వారా లభించిందని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని అవగాహన చేసుకోవాలని కోరారు.ఇకార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, గోధుమకుంట మాజీ సర్పంచ్ అకిటి మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కిరణ్ జ్యోతి ప్రవీణ్, మంచాల పెంటయ్య, మాజీ వార్డ్ సభ్యులు శివ యాదవ్, బాలరాజ్, శేఖర్, ప్రేమనాథరెడ్డ్ మరియు పర్వత రెడ్డి, అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు పాల్గొన్నారు.