Tuesday, August 26, 2025
Homeఆంధ్రప్రదేశ్గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్​ ప్రభుత్వం కీలక నిర్ణయం .బండ వాసుదేవ రెడ్డి

గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్​ ప్రభుత్వం కీలక నిర్ణయం .బండ వాసుదేవ రెడ్డి

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్‌, దుర్గమాత మండపాలకు ఉచిత విద్యుత్

మండపాలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్‌ (ఫ్రీ కరంట్) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అనుమతి తీసుకున్న వినాయక మండపాలకు ఉచిత విద్యుత్​ను అందించనున్నారు ఈనెల 27వ తేదీ నుంచి గణేశ్‌ ఉత్సవాలు ప్రారంభం కానున్న విషయం విదితమే మరోవైపు హైదరాబాద్‌ నగరంలో గణేశ్‌ మండపాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత పొందిన ఖైరతాబాద్‌ గణనాథుడి విగ్రహ నిర్మాణం చివరి దశకు చేరుకుంది గణేశ్​ మండప నిర్వాహకులకు పోలీసుల సూచనలు రాష్ట్రంలో వినాయక చవితి సందడి మొదలైంది మండపాల ఏర్పాటు, బొజ్జ గణపయ్య విగ్రహాల తరలింపు ప్రక్రియ ఊపందుకుంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు వినాయక మండపాల నిర్వాహకులకు పలు కీలక నిబంధనలు, హెచ్చరికలను జారీ చేశారు విగ్రహాల తరలింపు, వినాయక మండపాల ఏర్పాటు, నవరాత్రుల నిర్వహణ, నిమజ్జనం తదితర సమయాల్లో ఖచ్చితంగా పాటించాల్సిన పలు జాగ్రత్తలను, నియమాలను సూచించా ఈ నిబంధనలు తప్పనిసరి గణేశ్ మండపం ఏర్పాటు కోసం ఆన్‌లైన్‌లో పర్మిషన్‌ తప్పనిసరి మండపాల కమిటీలు తప్పనిసరిగా పర్మిషన్‌ కోసం https://policeportal.tspolice.gov.in/index.htm అప్లై చేసుకొని అనుమతి పొందాల్సి ఉంటుంది విద్యుత్‌ కనెక్షన్‌ కోసం డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) కట్టండి విద్యుత్​శాఖ అధికారుల అనుమతి తీసుకోండి గణేశ్ మండపాల నిర్మాణ పనులు నిపుణులకు అప్పగించండి కరెంట్​ పనులు సొంతంగా చేయొద్దు రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయొద్దు ప్రజలకు అసౌకర్యం ఎట్టిపరిస్థితుల్లో కలిగించొద్దు
డీజే, సౌండ్​ బౌక్స్​లకు అస్సలు అనుమతిలేదు రాత్రి 10 గంటల తర్వాత మైక్​ను వాడొద్దు మైక్‌లు వినియోగించేటప్పుడు సౌండ్ లెవెల్స్ ప్రభుత్వ రూల్స్​ మేరకే ఉండాలి మండపాల వద్ద నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) ఏర్పాటు చేయండి మరికొన్ని సూచనలు అగ్నిమాపకశాఖ నిబంధనలు పాటించాలి వర్షాలను దృష్టిలో పెట్టుకొని మండపాలు, ఇతర ఏర్పాట్లను చేసుకోవాలి భక్తుల తాకిడికి తగినట్లుగా మండపాల వద్ద ఏర్పాట్లు చేసుకోవడం తప్పనిసరి వెహికల్స్​ పార్క్ చేసుకొనేందుకు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలి ట్రాఫిక్​నకు ఆటంకం కలిగించొద్దు భక్తులను గైడ్‌ చేసేలా కొంతమంది వాలంటీర్లను నియమించండి
ముఖ్యంగా క్యూలైన్లు, ట్రాఫిక్‌ నియంత్రించేందుకు పాయింట్‌ బుక్​ను ఏర్పాటు చేయాలి గణేశ్ మండప నిర్వాహకుల కమిటీ సభ్యుల పూర్తి వివరాలు (పేరు, తండ్రిపేరు, మొబైల్​ నంబర్‌, చిరునామా), కమిటీ ప్రెసిడెంట్‌/కన్వీనర్‌/సెక్రటరీ ఎవరో స్పష్టంగా వివరాలు రాయాలి) అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై వెంటనే పోలీసులకు, ఠాణాకు సమాచారం ఇవ్వండి వినాయక విగ్రహం నిమజ్జనం కోసం ప్రభుత్వం/జీహెచ్‌ఎంఎసీ/పోలీస్‌ శాఖ సూచించిన అధికారిక నిమజ్జన స్థలాలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది పోలీస్‌ ఇచ్చిన అనుమతి పత్రం మండపంలో కనబడేలా ప్రదర్శించాలి నవరాత్రి మండపాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించండి విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి చిన్నారులకు అందే విధంగా వైర్లను ఏర్పాటు చేయొద్దు
స్థానికులు, సత్ప్రవర్తన కలిగిన వారిని మాత్రమే వాలంటీర్లుగా నియమించుకోవాలి వాలంటీర్లకు ఐడీ కార్డులు ఉండేవిధంగా చూసుకోవాలి రాత్రిపూట కూడా వాలంటీర్లను మండపం వద్దే ఉండేలా ఏర్పాటు చేసుకోండి తనిఖీ చేసిన తర్వాత మాత్రమే భక్తుల్ని మండపంలోకి అనుమతించాలి ఉత్సవ నిర్వాహకులకు సూచనలు మండపాల వద్ద ఎలాంటి టపాకాయలు, బాణాసంచా సామగ్రి ఉంచొద్దు మండపంలో ఎమర్జెన్సీ లైట్​ను అందుబాటులో ఉంచుకోండి జనరేటర్‌ వాడితే ఆయిల్​ను మండపం సమీపంలో నిల్వ చేయొద్దు మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలి అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను మండపం సమీపంలో ఉంచొద్దు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్లను నిర్ణీత డెసిబెల్స్‌ వరకు మాత్రమే వాడాలి హాస్పిటల్స్, విద్యాలయాలకు సమీపంలోని మండపాలు సౌండ్‌సిస్టమ్‌ విషయంలో నిబంధనలను పాటించాలి నిమజ్జనం కోసం కేటాయించిన రూట్‌లోనే వెళ్లాల్సి ఉంటుంది విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు ట్రాఫిక్‌ రద్దీగా ఉండే సమయంలో విగ్రహాలు తరలించొద్దు రద్దీ తక్కువగా ఉన్నప్పుడే తరలించండి విగ్రహం ఎత్తు ఆధారంగా ముందుగానే రూట్‌ ఎంచుకోండి నిమజ్జనం రోజు నిపుణులైన డ్రైవర్లను నియమించుకోండి చిన్న వాహనాల్లో భారీ విగ్రహాలను తరలించొద్దు పిల్లలను విగ్రహాల తరలింపు కోసం తీసుకెళ్లొద్దు కరెంట్ వైర్ల విషయంలో జాగ్రత్ భారీ విగ్రహాలను వాహనంలో పెట్టేందుకు క్రేన్‌లను ఉపయోగించండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments