
బస్టాండ్ ప్రాంగణంలో మొరం వేసిన దృశ్యం..
రుద్రూర్, సెప్టెంబర్ 4 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ గ్రామంలో శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75వ వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా రుద్రూర్ గ్రామంలో ఈనెల 6వ తేదీన నిర్వహిస్తున్న కార్యక్రమాలకు గణేష్ మండలి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా గణేష్ శోభయాత్రను ప్రధాన వీధుల గుండా నిర్వహిస్తారు. దీనిలో భాగంగా గ్రామంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రధాన వీధులలో, బస్టాండ్ ప్రాంగణంలో గుంతలు ఏర్పడిన చోట మొరాన్ని వేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి నిర్వహకులు చిదుర వీరేశం, పత్తి రాము, గెంటిల సాయిలు, పత్తి లక్ష్మణ్, గెంటిల గంగాధర్, ఎముల గజేందర్, కర్క అశోక్ తదితరులు పాల్గొన్నారు.