
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 3 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఓపెన్ ఇక అవినీతికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటమని గత టిఆర్ఎస్ పాలకులు ఎవరికివారు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ధ్వజమెత్తారు .జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి సోమవారం మధుర నగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని దీన్ని కొనసాగించాలంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి తప్పనిసరిగా గెలవాలని సూచించారు. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ బాగా చదువుకున్న, సేవా భావం ఉన్న వ్యక్తిని అలాంటి వ్యక్తిని గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు .విస్తృతంగా కరపత్రాలను పంపిణీ చేశారు కార్యక్రమంలో పట్లోళ్ల నాగిరెడ్డి, తూము వేణు, కృష్ణ రాజ్ పుత్ ,మేకల రమేష్, కుక్కల రమేష్ ,సతీష్ గౌడ్ ప్రవీణ్ కుమార్ , మోయునుద్దిన్, మల్లేష్ గౌడ్, హనుమంతరావు , జమీర్ ,జమీల సురేఖ తదితరులు పాల్గొన్నారు.
