PS Telugu News
Epaper

గత ప్రభుత్వం క్రీడాకారులను నిర్లక్ష్యం చేసింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శ

Listen to this article

నియోజకవర్గానికి 10 కోట్లతో క్రీడా స్టేడియం మంజూరు.

దివ్యాంగులకు సదరన్ క్యాంప్ సౌకర్యం.అక్టోబర్ నుంచి స్థానికంగా అందుబాటు

షాద్నగర్‌లో క్రీడా అభివృద్ధికి శంకుస్థాపన త్వరలో మంత్రి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, జితేందర్ నేతల హాజరు

110 నియోజకవర్గాలలో మొదటిగా షాద్నగర్‌కు స్టేడియం నిధులు మంజూరు

హర్షం వ్యక్తం చేస్తున్న షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలు

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

గత ప్రభుత్వం క్రీడాకారులను మరియు క్రీడా స్టేడియం నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో విమర్శించారు.షాద్నగర్ నియోజకవర్గంలో క్రీడా రంగానికి ప్రాధాన్యత కల్పిస్తూ 10 కోట్ల రూపాయల నిధులతో స్టేడియం మంజూరైనట్లు ఈ సందర్భంగా తెలిపారు. అతి త్వరలో క్రీడా శాఖ మంత్రి శ్రీహరి, చైర్మన్ సుదర్శన్ రెడ్డి, జితేందర్ రెడ్డితో కలిసి స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నో అడ్డంకులు అవరోధాలు ఎదురైనా నిర్మాణం కోసం భూమి కేటాయించడంలో కాంగ్రెస్ మండల నాయకుల పాత్ర అభినందనీయమని ప్రశంసించారు. తెలంగాణ సీఎం సహకారంతో ఈ నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే అన్నారు.ఈ ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మండల కాంగ్రెస్ నేతల కృషి వల్లే ఈ సాధన సాకారమైందని ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా, దివ్యాంగుల కోసం సదరన్ క్యాంప్ స్లాట్ బుకింగ్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు, అక్టోబర్ నుంచి స్థానికంగా సదరన్ క్యాంప్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే శంకర్ వెల్లడించారు ప్రజా పాలనతో సమన్యాయం:ప్రజాపాలన ద్వారా బడుగు, బలహీన వర్గాలకు సమన్యాయం చేకూరుతుందని, ప్రభుత్వం అన్ని రంగాలలో ప్రజల ఎదుగుదలకు సహాయ సహకారాలు అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. 110 నియోజకవర్గాలలో మొట్టమొదటగా షాద్నగర్‌లో క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఇది ప్రాంత అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం ద్వారా షాద్నగర్ నియోజకవర్గంలో క్రీడా సౌకర్యాలు మరియు దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్పష్టమవుతున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top