
పయనించే సూర్యుడు తేదీ 4 నవంబర్ మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.
నాలుగు తులాల బంగారం మాయం గద్వాల టౌన్ శేరెల్లివీధిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె మెడలో ఎప్పుడూ ఉండే నాలుగు తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీను, ఎస్ఐలు కల్యాణ్ కుమార్, శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దోపిడీ అనంతరం హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.