
- మాజీ ఎంపీటీసీ జి. బలరాం రెడ్డి..
పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్27//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
మక్తల్ : ప్రస్తుత రబీ సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యం కొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పంటలు చేతికొచ్చి నెల రోజులు గడుస్తున్నా కానీ రైతులకు అవసరమైన గన్ని బ్యాగులు ప్రభుత్వం ఇంకెప్పుడూ అందిస్తుందని మాజీ ఎంపిటిసి జి. బలరాం రెడ్డి అన్నారు. ఇప్పటికే పంటలు కోసిన రైతులు గన్నీ బ్యాగులు అందుబాటులో లేక గత నెల రోజులుగా కల్లాల్లో దాన్యం కుప్పలపై నిద్రించే దుస్థితి నెలకొందన్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయడంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. మరి ముఖ్యంగా ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం స్పందించి గన్ని బ్యాగులను తక్షణమే అందజేయడంతో పాటు వడ్లను పూర్తిగా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను తరలించేందుకు రవాణా సదుపాయం కల్పించకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. తక్షణమే వడ్ల తరలింపునకు లారీలను అందుబాటులోకి తేవాలన్నారు. లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాడుతామని అన్నారు.