పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 11:- రిపోర్టర్( షేక్ కరిముల్లా )
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదన్ రెడ్డిని నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల నాయకులు కలసి అభినందనలు తెలియజేసి దృశ్యాలువ,పూలమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని కార్యకర్తలను నాయకులను ఏకతాటిపై నడిపించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని,పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని మరల ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఆయన కలిసిన వారిలో పర్చూరు మండల పార్టీ అధ్యక్షులు కటారి అప్పారావు,లంక శివ, చినగంజం సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆసోది బ్రహ్మారెడ్డి, రామకృష్ణారెడ్డి,చెరుకూరి ఎంపీటీసీ సభ్యులు వీరయ్య, నాగులపాలెం పార్టీ నాయకులు శేషగిరి మరియు వివిధ గ్రామాల ప్రజలు ఉన్నారు