
పయనించే సూర్యుడు అక్టోబర్ 1 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు గ్రామం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయానికి బుధవారం హైదరాబాదుకు చెందిన కలకోట రమణా చార్యులు- కిరణ్మయి దంపతుల కుమారులు శ్రీ తేజ, రవితేజలు సుమారు 20వేల రూపాయల విలువైన మూడు స్టీల్ స్టాండ్స్, స్టూల్ బహుకరించారు. నూతన వస్త్రాలు సమర్పించారు. రమణాచార్యులు కిరణ్మయి దంపతుల కుమారుడు శ్రీ తేజ యూఎస్ఏ వెళ్లిన సందర్భంగా దేవాలయానికి స్టీల్ స్టాండ్స్ బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకట దుర్గాప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ నారాయణ, అర్చకులు బిటుకూరి వేణుగోపాలచార్యులు, నాగరాజ చార్యులు, కిరణ్ కుమార్ చార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.