
పయనించే సూర్యడు న్యూస్. కొయ్యురు జనవరి 21. రిపోర్టర్ 🙁 చల్లంగి వినోద్ )
చిట్టెంపాడు పంచాయతీలో మారుమూల గ్రామమైన గోపవరం నుంచి లింగాపురం గ్రామానికి ఎన్నో ఏళ్ల తరబడి కనీసం రోడ్డు కూడా లేని గ్రామంగా ఉండిపోయింది. పాడేరు నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారి చొరవతో లింగాపురం గ్రామస్తులకు ఆ కల నెరవేరబోతుంది. ఈరోజు లింగాపురం గ్రామస్తులతో కొయ్యూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో మారుమూల గిరిజన గ్రామాలకు డోలుమోహతలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి నాయకుల లక్ష్యమని అలాగే రోడ్డు లేని ప్రతి గ్రామానికి రోడ్డు వచ్చేలా చేయడమే కూటమి నాయకుల లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు మండల మహిళా అధ్యక్షురాలు బోనంగి సత్యవతి మాజీ సర్పంచ్ పాడి ధారబాబు. చిట్టెంపాడు బూత్ ఇంచార్జ్ వార కొండలరావు. రిమల జగన్. పాడి వెంకటేష్. గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు