
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్
అశ్వారావుపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ ను పర్మినెంట్ చేయాలని పాత పద్ధతిలోనే జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా డైలీ వేజ్ కార్మికులు తమ విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ ఒకవైపు ధరలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ డైలీ వేజ్ కార్మికుల వేతనాలు పెంచకపోగా జీతాలు తగ్గించటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని అన్నారు. డైలీ వేజ్ కార్మికుల వేతన సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులు మంత్రులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తప్పనిసరి పరిస్థితుల్లోనే నిరువేదిక సమ్మెకు వెళ్లడం జరిగిందని తెలిపారు. దినసరి కార్మికులకు పాత పద్ధతుల్లోనే జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని కార్మికులను పర్మినెంట్ చేయాలని మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను దినసరి వర్కర్లుగా నియమించాలని,గత సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో యూనియన్ నాయకులు బత్తుల శ్రీను లక్ష్మి నాగమణి అరుణ నాగమణి ఎల్లమ్మ బుచ్చమ్మ కుమారి అనిత లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.