
తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో కదం తొక్కిన గిరిజన మహిళ సీజనల్ వ్యాధులు పచ్చదనం పరిశుభ్రత ప్రభుత్వ పథకాలపై పల్లెప్రజల్లో చైతన్యం
పయనించే సూర్యుడు మార్చి 13 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాదు రవీంద్రభారతిలో విజన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టేకులపల్లి మండలానికి చెందిన తెలంగాణ సాంస్కృతిక సారధి సభ్యురాలు అవార్డును అందుకున్నారు తెలంగాణ ఉద్యమంలో నీల తన ఆటపాటలతో పల్లెప్రజలను చైతన్యపరచి పచ్చదనం పరిశుభ్రత గురించి తన ఆటపాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్రను నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవటంలో నీలా ముందంజలో ఉన్నారు స్వచ్ఛభారత్ పచ్చదనం పరిశుభ్రత సీజనల్ వ్యాధులు మరెన్నో అంటువ్యాధులపై పల్లె ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు ఆమె ప్రతి పని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక విభాగంలో సభ్యురాలుగా ఉద్యోగ అవకాశాన్ని కల్పించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నీల ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో నివాసం ఉంటూ సాంస్కృతిక సారధి ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు టేకులపల్లి మండలం 9వ మైలు తండకు చెందిన గిరిజన రైతు కుటుంబాల్లో పుట్టిన గుగులోత్ నీల కళా సాంస్కృతిక రంగంలో అంచలంచలుగా ఉన్నత స్థాయికి ఎదిగి నేడు రాష్ట్ర స్థాయి వార్డు అందుకోవటం పట్ల ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు పలువురు ప్రముఖులు స్నేహితురాలు యువత మేధావులు ఆమెను ప్రశంసిస్తున్నారు రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయస్థాయిలో మరిన్ని అవార్డులు అందుకోవాలని పలువురు కోరుతున్నారు
