పయనించే సూర్యుడు. జనవరి 27. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని గౌరవించి షెడ్యూల్ ఏరియా గిరిజన హక్కులను కాపాడాలి,టీఏసీ (ట్రైబల్ అడ్వైజరీ కమిటీ/కౌన్సిల్) ఏర్పాటు చేసి జిఓ 3 స్థానంలో కొత్త జీఓను తీసుకురావాలి:- ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్,తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ (టిజిటిటిఎఫ్),రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ (టిజిటిటిఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జంబో కమిటీ ఎన్నిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులుగా వాంకుడోత్ రమేష్ బాబు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా భూక్య శంకర్ నాయక్,ప్రధాన కార్యదర్శిగా గోల్డ్ వీరన్న ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది*. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లోతువాగు SR గార్డెన్స్ పంక్షన్ హాల్
భూక్య శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగిన టిజిటిటిఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిజిటిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మాలోత్ రామారావు హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.
రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్* మాట్లాడుతూ జనవరి 26 రోజు భారత రాజ్యాంగo అమలులోకి వచ్చిన రోజని,రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించి షెడ్యూల్ ఏరియా గిరిజన హక్కులను కాపాడాలని,టీఏసీ (ట్రైబల్ అడ్వైజరీ కమిటీ/కౌన్సిల్) ఏర్పాటు చేసి జిఓ 3 స్థానంలో కొత్త జీఓ తీసుకురావాలని కోరారు. పదవి విరమణ వయసు పెంపు ఆలోచనను విరవించి 61 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలకు కుదిస్తే బాగుంటుందని,యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వాన్ని తెలియజేశారు. సిపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో 604 మండలాలలకు గాను ఉన్న 44 ఏజెన్సీ మండలాలల గిరిజన హక్కులను భారత రాజ్యాంగానికి లోబడి షెడ్యూల్ 5,6 ప్రకారం పరిరక్షించాలని కోరారు. 317 స్పౌజ్ బదిలీల విషయంలో అందరికి న్యాయం చేయాలని కోరారు. పి ఆర్ సి ని 45% ఫిట్మెంట్ తో వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.
జిఓ 29 వలన ఎస్ టి ఎస్ సి వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని వెంటనే ఈ జిఓ ను రద్దు చేయాలని, ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని,10% రిజర్వేషన్ అనేది ఓపెన్ కోటా నుండి తీసుకోవాలని కోరారు. అనంతరం తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని ఎలక్షన్ కమిటీ సమక్షంలో ఏకగ్రీవంగా ఎంపిక జరిగేలా చేశారు.ఎలక్షన్ కమిటీ సభ్యులు బి.శంకర్ ,యన్.శోభన్, బి.బిచ్చ,మోహన్ లాల్,వి.జ్యోతి,హీరాలాల్ పర్యవేక్షణలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జంబో కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.హతీరాం,యం.బిచ్చ, గౌరవ సలహాదారుడు బి.శంకర్,రాష్ట్ర నాయకులు శోభన్,. బన్సీలాల్, బిచ్చా,హరి.బాలు,రమేష్,రామ్ సింగ్,వీరన్న,రవికుమార్, కిషన్, హీరాలాల్, పూల్సింగ్, నర్సింహారావు,లక్ష్మణ్,రామచందర్,గణేష్,సర్వన్, బాలాజీ,చందు, మంగిలాల్, రాంజీ,జంకిలాల్, కిషన్.రాము, రాజేష్, మోహన్ నాగేశ్వరరావు,భిక్కులాల్ ,భావుసింగ్ తారాచంద్,రవికుమార్, మాలు,రవీందర్,కబిర్దాస్,గోపి,మాన్సింగ్,లచ్చు,గోపి,భిక్షం, డీఎన్ఆర్ .మురళి తదితరులు పాల్గొన్నారు.
గిరిజన హక్కులను కాపాడాలి,టీఏసీ
RELATED ARTICLES