
50 ఏళ్లు దాటిన గీతకార్మికుల జీవనం దయనీయ స్థితి
ప్రభుత్వ నిర్లక్ష్యం భరించలేనిదిగా మారింది
పింఛన్ హక్కు కోసం ఉద్యమ స్వరం
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్
గీతకార్మికుల పింఛన్ కోసం గొంతెత్తారు. గీతకార్మికుల సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది గీతకార్మికులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మున్సి పల్ కమిషనర్ బి నాగరాజును కలిసి, 50 సంవత్సరాలు పైబడిన గీతకా ర్మికులకు తక్షణం పింఛన్ సౌకర్యం కల్పించాలని వినతిపత్రం అందజేశా రు. గీత కట్టడం వృత్తిగా తీసుకొని జీవితమంతా కష్టపడి, చెమటోడ్చి, ప్రజలకు ఆవశ్యకమైన పానీయాన్ని అందిస్తున్న ఈ వృత్తి కార్మికులు వయస్సు పైబడిన తర్వాత దిక్కులేని పరిస్థితిలో జీవించాల్సి వస్తోందని వారు వాపోయారు. ఎలాంటి ఆరోగ్య భద్రత, సామాజిక భద్రతా చర్యలు లేవని, వృద్ధాప్యంలో కనీస జీవన భరోసా కూడా లభించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. “పింఛన్ మాకు భిక్ష కాదు, హక్కు” అంటూ గీతకార్మికులు స్పష్టం చేశారు. జీవితం పొడవునా సమాజానికి అవసరమైన సేవ చేసిన గీతకార్మికులకు తక్షణమే పింఛన్ కల్పించాలని, ఈ వినతిపత్రాన్ని నిర్లక్ష్యం చేస్తే మరింత ఉధృతమైన ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. అధికారులు గీతకార్మికుల సమస్యలను పైస్థాయి ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. అయితే గీతకార్మికులు తక్షణ పరిష్కారాన్ని మాత్రమే ఆశిస్తున్నారు.