
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 20:- రిపోర్టర్( కే. శివ కృష్ణ)
గుంటూరు రేంజ్ పరిధిలోని పోలీస్ అధికారులతో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాపట్ల ఎస్పీ తుషార్ డూడి, అడిషనల్ ఎస్పీ టీ.పీ. విఠలేశ్వర్, బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిబంధనల అమలు, అసాంఘిక కార్యకలాపాల కట్టడి వంటి అంశాలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలను హోమ్ మినిస్టర్ సమీక్షించారు. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల రవాణా కార్యకలాపాలను అరికట్టడంలో పోలీసుల భద్రతా చర్యలు ప్రస్తావించారు. ప్రజల్లో భరోసా పెంచే విధంగా టెక్నాలజీ సాయంతో ‘ఇన్విజిబుల్ పోలీసింగ్’, ‘విజిబుల్ పోలీసింగ్’ను సమర్థవంతంగా అమలు చేయాలని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత సూచించారు.