
పయనించేసూర్యుడు జూన్ 12 (పొనకంటి ఉపేందర్ రావు )
. టేకులపల్లి :మండలం, చింతోని చెల్క గ్రామ పంచాయితీ నందు గల వజ్జోనిగూడెం హ్యాబిటేషన్ లోని గుత్తి కోయ గ్రామం ‘సర్వన్ బోడు’ లో త్రాగునీటికి ఎన్నో సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు స్పందించినజిల్లా కలెక్టర్ ఆదేశముల మేరకు, జిల్లా పంచాయతి అధికారి ఆధ్వర్యంలో మండల అధికారుల పర్యవేక్షణ లో బోర్ వేయించి హ్యాండ్ పంప్ ఫిట్టింగ్ చేయించడం జరిగినది సార్. గుత్తి కోయల గ్రామం వారు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కలను సాకారం చేసి వారి దాహార్తిని తీర్చినటువంటి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పంచాయతి అధికారికి సర్వన్ బోడు గ్రామ ప్రజల తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాము