
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12( మల్కాజిగిరి నియోజకవర్గం ఇన్చార్జ్ రఘుపతి): రఘుపతి చిన్నప్పటి నుంచి డాన్స్ పై ఇష్టంతో థియేటర్లో సినిమాలు చూస్తూ డాన్స్ నేర్చుకుని 1996లో డాన్సులో ఉన్న మక్కువతో హైదరాబాదుకి చేరుకొని డాన్స్ కార్డు కోసం వెళితే అక్కడ క్లాసికల్ డాన్స్ కూడా ఉండాలి అని అనడంతో తన జిల్లా అయినా వరంగల్లో ప్రభుత్వ సంగీత కళాశాలలో కూచిపూడి నాట్యాన్ని పద్మజా గారి దగ్గర అభ్యసించి తరువాయి వక్కల రామకృష్ణ దగ్గర శిష్యరికం చేసి అనేక మెలుకువలు నేర్చుకొని నాట్యాన్ని అభివృద్ధి చేసుకున్నాడు.2009లో బోయినపల్లి సన్ పీటర్స్ హై స్కూల్ లో డాన్స్ టీచర్ గా చేరి 2015 వరకు చేసి 2015 నుంచి ఇప్పటివరకు పల్లవి మోడల్ స్కూల్ అల్వాల్ లో కూచిపూడి నాట్య గురువుగా పనిచేస్తూ. బయట విద్యార్థులకు కూచిపూడి నాట్యాన్ని అందిస్తూ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ తన శిష్యులను కాశి. అరుణాచలం. భద్రాచలం. హైదరాబాదులో రవీంద్ర భారతి. ఎన్టీఆర్ ఆడిటోరియం. తెలంగాణ సరస్వత. యాదగిరిగుట్ట ఇలా అనేక చోట్ల నాట్య ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో అవార్డులు అందుకున్నారు. అవార్డులు నాట్య మయూరి. నాట్య కళానిధి.వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్.తెలంగాణ బెస్ట్ డాన్సర్. నంది అవార్డు. ఇప్పుడు 2025లో “గురుబ్రహ్మ” రాష్ట్ర అవార్డు అందుకోవడం జరిగింది. రఘుపతి మరియు రఘుపతి శిష్య బృందం చే ఎన్నో చోట్ల నాట్య ప్రదర్శనలు ఇచ్చాడు వీటికి గుర్తింపుగా సెంట్ మదర్ తెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కే కృష్ణమూర్తి గుర్తించి గురుబ్రహ్మ రాష్ట్ర అవార్డు సర్టిఫికెట్ మరియు మెడల్ పాఠశాలకి పంపినాడు.ఇందుకు రఘుపతి సెంట్ మదర్ తెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కె కృష్ణమూర్తికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఆర్గనైజేషన్ వాళ్లు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సేవలను అందిస్తూ ఉపాధ్యాయులను అనేక రంగాల వారిని గుర్తిస్తూ ముందుకు తీసుకు వెళుతున్నారు. కృష్ణమూర్తి అందుబాటులో లేకపోవడం వల్ల సెయింట్ మదర్ తెరిసా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి పాఠశాల కి పంపించడం ద్వారా పల్లవి మోడల్స్ స్కూల్ అల్వాల్ ప్రిన్సిపాల్ విద్యాధరి రావు చేతులు మీదుగా “గురుబ్రహ్మ” రాష్ట్ర అవార్డు సర్టిఫికెట్ మరియు మెడల్ అందుకోవడం జరిగింది.ప్రిన్సిపాల్ విద్యాధరి రావు మరియు వైస్ ప్రిన్సిపాల్ సుజన్ మరియు హెచ్ఎం షిరిన్ రఘుపతిని ప్రోత్సహిస్తూ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నాము అని చెప్పడం జరిగింది.