
సంస్కార భారతి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమితి ఆధ్వర్యం లో ఘనంగా గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహణ .
( పయనించే సూర్యుడు జూలై 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
సమాజంలో గురువును దేవునికన్నా మిన్నగా భావించి పూజించడం మన సాంప్రదాయమని విద్యా బుద్ధులు నేర్పించి అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞాన జ్యోతులను వెలిగించి మనిషి జీవితం ఆనందంగా సాగుటకు కావలసిన జీవన నైపుణ్యాలను జ్ఞానమార్గాన్ని బోధించే గురువులకు భక్తితో పూజించి వారి ఆశీస్సులను పొందే రోజే ఈ గురు పూర్ణిమ అని సంస్కార భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు శ్రీ టీ.వీ.రంగయ్య అన్నారు.వ్యాసుని జన్మ దినోత్సవమైన గురుపూర్ణిమనాడు సంస్కార భారతి ప్రతి సంవత్సరం నటరాజ పూజా దినోత్సవంగా ఆనవాయితీ గా నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా విద్యా గురువులు, నాట్య గురువులు ,సంగీత, సాహిత్య గురువులను కొద్దిమందినిని ఎంపికచేసి వారి ఇంటిదగ్గరనే వారి శిష్యులు సంస్కార భారతి సభ్యులు కలిసి వారిని సత్కరించడం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని సంస్థ.గౌరవాధ్యక్షులు కే.రంగనాథం అన్నారు. అందులో భాగంగా
గత పది స్వత్సరాలుగా షాద్ నగర్ లో కూచిపూడి నృత్య శిక్షకురాలిగా ఎంతో మంది చిన్నారులకు నృత్యశిక్షణ నిచ్చి పలు ప్రదర్శనలు చేయిస్తూ, సాంప్రదాయ కళలకు జీవం పోస్తున్న ఆర్ .కె. రంజు ప్రవీణ షాద్ నగర్ ని , అలాగే గత పది సంవత్సరాలుగా చిన్నారులకు మరియు సంగీతం పై మక్కువ గలిగిన పెద్దలకు సాంప్రదాయ సంగీతంలో శిక్షణను ఇస్తూ పలు సంగీత విభావరిలలో పాల్గొంటూ పాల్గొన చేయిస్తూ సాంప్రదాయ సంగీతానికి జీవం పోస్తూ ముందు తరాలకు అందిస్తున్న . కాకమోని సురేంద్ర షాద్ నగర్ ని, అలాగే కొన్ని సంవత్సరాలుగా వేలాది మందికి యోగాలో శిక్షణ ఇస్తూ ఎంతో మంది శిష్యులను ప్రశిష్యులను తయారు చేసి నిత్యం యోగా తరగతులు నిర్వహిస్తున్న సీనియర్ యోగా గురువు పానుగంటి శశిధర్ షాద్ నగర్ ని వారి ఇండ్ల దగ్గరకు వెళ్లి సంస్కార భారతి సభ్యులు ,వారి శిష్యులు కలిసి ఘనంగా సత్కరించి నూతన వస్తాలు అందించి గౌరవ సత్కారం అందించడం జరిగింది.కార్య క్రమాన్ని రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శివ మాస్టర్ సంస్కార భారతి రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ డాక్టర్ కే .రంగనాథం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సింగారం శ్రీనివాస్ సభ్యులు శ్రీ లింగం గౌడ్ లక్ష్మీ చిన్నారులు వర్షిణి. యశ్విత శిష్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
