
పయనించే సూర్యుడు అక్టోబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్రప్రదేశ్ కు శుభపరిణామమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఓ ప్రకటన ద్వారా తెలుపుతూ ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాప్ట్ వంటి సంస్థలు తీసుకువచ్చి హైదరాబాద్ ను ఏ విధంగా అభివృద్ధి చేశారో నేడు విశాఖపట్నంకు గూగుల్ ను తీసుకువచ్చి నవ్యంద్రాప్రదేశ్ ముఖచిత్రాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చనున్నారు. రాష్ట్రాభివృద్దికి దోహదపడే విధంగా సీఎం చంద్రబాబు పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి గూగుల్ సంస్థను విశాఖకు తీసుకువస్తున్నారనీ, ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలతో భేటీ అయ్యి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు సృష్టించి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చంద్రబాబు చేస్తున్న కృషి ఫలితాలను ఇస్తున్నాయని ఆమె వివరించారు. విశాఖకు గూగుల్ రావడం రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచేలా ఉందనీ, దేశంలోనే అత్యుత్తమమైన 26 పాలసీలను రూపొందించి సంస్థల నిర్మాణానికి వేగంగా అనుమతులు, భూముల కేటాయింపు నుంచి పవర్ సప్లై వరకు ఒక్క అడ్డంకి లేకుండా సింగిల్ విండో క్లియరెన్స్ ఉమ్మడి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, సమర్ధవంతమైన నాయకత్వం ఉండడంతో రాష్ట్రానికి గూగుల్, టీసీఎస్, ఆక్సెంచర్ వంటి టెక్ దిగ్గజాలు వస్తున్నాయని,
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలో వచ్చిన పెట్టుబడులు కంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిని 16 నెలలోనే వచ్చిన పెట్టుబడులు అధికంగా రావడం జరింగిందిని, ఈ 16 నెలల్లో రాష్ట్రానికి రూ.11.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 9.5 లక్షల ఉద్యోగావకాశాలు లభించాయని,
గూగుల్ కంపెనీ రాకతో యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు అందనున్నాయని, యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా, వారి అభివృద్ధికి బాటలు వేసేలా, యువతను ఒక బలమైన శక్తిగా మార్చేందుకు ఇటువంటి సంస్థలను రాష్ట్రానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీసుకువస్తున్నారని,అధునాతన టెక్నాలజీని విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు అందించాలని నైపుణ్య శిక్షణ కేంద్రాలతో పాటు వచ్చే విద్య సంవత్సరం నుండి పాఠ్యాంశాల్లో ఏఐ పాఠ్యాన్ని చేర్చనున్నారని,ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ మొన్న అమరావతికి క్వాంటం వ్యాలీని తీసుకువచ్చి, నేడు విశాఖకు గూగుల్ ను తీసుకురావడం జరిగిందని, ఇవి రాష్ట్రాభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదపడతాయని,హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ రావడంతో టెక్ అభివృద్ధికి ఎలా గేమ్ చేంజర్ అయిందో, అలా ఇప్పుడు గూగుల్ విశాఖపట్నం కు రావడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధికి గేమ్ చేంజర్ మారనుందని,రూ.55 వేల కోట్ల పెట్టుబడితో సౌత్ ఆశియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్ ను నిర్మించబోతోందనీ, ఇది రాష్ట్రాభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలిచిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు.