
పయనించే సూర్యుడు మే9 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ భవనం ఎదుట నూతన గృహ నిర్మాణ శాఖ కార్యాలయాన్ని యాడికి టిడిపి మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రుద్రమ నాయుడు మాట్లాడుతూ నూతన గృహ నిర్మాణం కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని హౌసింగ్ జేఈ లోకేష్ ను కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ జేఈ లోకేష్, డాటా ఎంట్రీ ఆపరేటర్ రాజేశ్వరి, వర్క్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫీ పట్టణ అధ్యక్షులు వెలిగండ్ల ఆదినారాయణ, ఐ టి డి పి అధ్యక్షులు నరసింహ చౌదరి,బీసీ అధ్యక్షులు తీరంపురం నీలకంఠ, గుండా నారాయణస్వామి, కోడూరు నీలకంఠారెడ్డి, హాజీ మస్తాన్, భాష, రహంతుల్లా, వెంకటేష్, ఖాదర్ వలీ, హౌసింగ్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
