
పయనించే సూర్యుడు మార్చి 29 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గొల్లపల్లి గ్రామంలో ఉడత. హజరతయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పూలమాలవేసి కేక్ కట్ చేసి శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలపడానికి సామాన్యుడు చేతికి పాలన అధికారం ఇవ్వడానికి నిరుపేదలు ఆనందంగా జీవించడానికి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు యువకులు తదితరులు పాల్గొన్నారు