
పయనించే సూర్యుడు రిపోర్టర్
జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 30 గోండ్వానా రాజ్యం ఆదివాసీ రాజ్యమని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు అన్నారు.భారత దేశ చరిత్రను ప్రాచీన యుగం, మధ్య యుగం,ఆధునిక యుగం,జాతీయోధ్యమం అనే నాలుగు భాగాలుగా చేసినట్లయితే మధ్య యుగంలో ఉన్న గోండ్వానా ఆదివాసీ రాజ్యం గురించి చరిత్ర పుటల్లో ఎందుకో సరైన వివరణ ఇవ్వకపోవడం దురదృష్టకరం,బాధాకరం.బహుశా గోండ్వానా రాజ్యం ఆదివాసీ రాజ్యమనేమో.1907లో
భూవిజ్ఞానం ప్రకారం సుమారు 600–180 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు భూమిపై ఉన్న ఒక మహా ఖండం గోండ్వానా,ఒక ప్రాచీన సూపర్ ఖండం.
ఈ సూపర్ ఖండం తర్వాత విభజించబడి నేటి ఖండాలుగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, భారత ఉపఖండం, అరేబియా గా మారింది.గోండ్వానా అనే పేరు భారతదేశంలోని మధ్యప్రదేశ్ ప్రాంతంలో గల గోండ్ తెగ పేరు నుండి వచ్చింది. ఆ ప్రాంతంలో మొదట ఈ భూగర్భ శిలాజాలు గుర్తించారు.గోండ్వానా భూమి భౌగోళిక చరిత్రలో పాలియోజోయిక్ మరియు మీసోజోయిక్ యుగాల్లో ఉంది.మొదటిగా 1850లలో భూశాస్త్రవేత్తలు ఈ పదాన్ని వాడారు.దీని విభజన తర్వాతే ఇండియన్ ప్లేట్ ఉత్తర దిశగా కదిలి హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.అంటే, గోండ్వానా అనేది ఒకప్పుడు ఉన్న భూమి సూపర్ ఖండం, దీనినుంచే నేటి ఖండాలు విడిపోయి ఏర్పడ్డాయని,భారత దేశంలో ఈ గోండ్వానా భూమిని గోండ్వానా, గోండారణ్య అని కూడా పిలుస్తారు.గోండ్వానా మహారాష్ట్ర లోని విదర్బ ప్రాంతం యొక్క తూర్పు భాగం,దానికి ఉత్తరాన ఉన్న మధ్యప్రదేశ్ భాగాలు మరియు ఛత్తీస్ ఘర్ పశ్చిమాన ఉన్న భాగాలుగా పరిగణించవచ్చు.ఈ విశాలమైన ప్రాంతం ఉత్తర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,పశ్చిమ ఒడిషా మరియు దక్షిణ ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించిఉంది.ఈ ప్రాంతం ఉత్తర దక్కన్ పీఠభూమిలో భాగం.సగటు ఎత్తు దాదాపు 600-700 మీటర్లు. భౌగోళికంగా ఇది ఎక్కువగా ప్రీకాంబియన్ శిల,కొన్ని ప్రాంతాలు పెర్మియన్ మరియు ట్రయాసిక్ యుగం.కొన్ని ప్రాంతాల్లో ఈ పాత శిలలు ఒండ్రు మట్టితో కప్పబడి ఉంటాయి.పశ్చిమాన ఇది దక్కన్ ట్రాప్స్ యొక్క అగ్ని శిలలతో కప్పబడి ఉంటుంది.ప్రకృతి దృశ్యం సాధారణంగా ఎగుడు దిగుడగా మరియు కొండలతో ఉంటుంది.గోండ్వానా ప్రాంతంలో గోండ్ ఆదివాసీలు మరియు ఇతర ఆదివాసీలు పాలక కుటుంబాలు అనేక రాజ్యాలను స్థాపించాయి.వీటిలో మొదటిది 1398లో మధ్యప్రదేశ్ లోని ఖేర్లా రాజు నర్సింగ్ రాయ్ గోండ్వానా కొండలన్నింటిని పరిపాలించగా, అతనిని మాల్వా రాజు హౌషాంగ్ షా చంపాడు.14 వ శతాబ్దం నుండి 18 శతాబ్దం వరకు మూడు ప్రధాన గోండ్ రాజ్యాలు ఉన్నాయని,గర్హా-మాండ్లా,ఎగువ నర్మదా నది లోయను,దేవఘర్-నాగ్ పూర్ కన్హాన్ నది,మరియు ఎగువ వైన్ గంగా నదీ లోయలను మరియు చంద్ర-సిర్పూర్ ప్రస్తుతం చంద్రపూర్,గడ్చిరోలి మరియు తూర్పు ఆదిలాబాద్ జిల్లాలను ఆక్రమించాయి.గర్హా మండ్లా,డియోగడ్ మరియు చందా సిర్పూరు అనే మూడు గోండ్ సంస్థానాలు నామమాత్రంగా మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోకి వచ్చాయి.1595లో బేరారును స్వాధీనం చేసుకున్న తర్వాత మోఘలులు వార్తా జిల్లాలోని పౌనారు మరియు బేతూలు జిల్లాలోని ఖేర్లలో గవర్నర్లను ఏర్పాటు చేసారు.అయితే మొఘల్ లు వారిపై సార్వభౌమాధికారాన్ని కటించలేకపోయారు.గోండ్ ఆదివాసీ రాజులు వారి ఆధిపత్యలలో స్వాతంత్ర్యాన్ని అనుభవించారు.గోండ్వానా మొఘల్ సామ్రాజ్యం పరిపాలనలో లేదు.మోఘలుల పతనం తర్వాత బుందేలా మరియు మరఠా సామ్రాజ్య పాలనలోకి వచ్చింది.17వ శతాబ్దంలో ఛతర్ సాల్,బుందేలా వింధ్యన్ పీఠభూమి మరియు నర్మద లోయలోని కొంత భాగాన్ని మాండ్ల రాజ్యానికి కోల్పోయాడు.1733లో మరాఠా పేష్వా బుందేల్ ఖండ్ ను గెలుచుకున్నాడు.1735లో మరాఠాలు హంగర్ లో తమ అధికారాన్ని స్ధాపించారు.1742లో పేష్వా మాండ్లకు చేరుకుని 1781గర్వా-మాండ్లలో గోండ్ రాజవంశాన్ని పడగొట్టి మరాఠాల ఆధీనంలోకి తెచ్చుకున్నారు,ఇంతలో గోండ్వానాలో ఇతర స్వతంత్ర రాజ్యాలు పతనమయ్యాయి.1743లో బేరారుకు చెందిన రాఘేజీ భోంష్లే నాగపూర్ లో స్థిరపడి 1751 నాటికి డియోగర్ చందా మరియు ఛత్తీస్ ఘర్ భూభాగాలను స్వాధీనం చేసుకున్నాడు.18 శతాబ్దంలో మరాఠాలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించకొన్నారు.19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకొన్నారు.19 వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయని రాజబాబు సవివరంగా చెప్పారు.
