
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 15
గోండ్వానా ఆదివాసీ రాజ్యాన్ని పరిపాలించింది ఆదివాసి గోండ్ రాజులని,ఆదివాసీ గోండ్ రాజులు చరిత్ర ప్రపంచానికి తెలపక పోవడం బాధకరమని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ఆవేదన వ్యక్తం చేశారు.భారత దేశ చరిత్రలో మౌర్యులు,గుప్తులు,పీష్వాలు,మరాఠాలు,కాకతీయులు,పల్లవులు,చాళుక్యులు,రాష్ట్రకూటులు,విష్ణుకుండినులు,మొఘలాయిలు,శాతావాహనులు మొదలగు రాజవంశాల చరిత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అదే స్థాయి ప్రాధాన్యత ఆదివాసీ గోండ్ రాజులకు కూడా ఉంది.మధ్య భారతదేశంలో గోండ్ ఆదివాసీ రాజుల పాలన 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు జరిగింది.1700 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించిన ఆదివాసీ గోండ్ రాజులలో (పాలకులలో) రాణి కమలాపతి భోపాల్ రాజ్యానికి చివరి గోండ్ పాలకురాలని పరిగణిస్తారు.52 యుద్ధాలలో గెలిచిన అక్బర్ చక్రవర్తికి ఎదురు నిలిచి 3 సార్లు ఓడించి ప్రసిద్ది గాంచిన గోండ్ ఆదివాసీ పాలకురాలు రాణిదుర్గావతి.దేవగడ్ రాజ్యాన్ని పాలిస్తున్న గోండ్ ఆదివాసీ రాజు భక్త్ బుల్డన్ షా నాగపూర్ ను రాజధాని నగరం గా నిర్మించి, నాగపూర్ ఖిల్లాను నిర్మించాడు. ఖిల్లా అనగా కోట.నాగా పూర్ పురాతన కాలంలో నాగవంశపు ఆదివాసీ గోండ్ రాజుల రాజధానియే కాక గోండి ధర్మ సంస్కృతి కేంద్రంగా విలసిల్లి,గోండి సంస్కృతి సంపదను క్రీ.శ.1700 వరకు సంపూర్ణ స్వరూపంగా వెలిచింది. నేటికీ కూడ నాగ్ పూర్ ను భక్త్ బులంద్ షా జిల్లా అని పిలుస్తారు.సమారు ఆరు రాష్ట్రాల్లో విస్తరించిన గోండ్వానాను అప్రతిహతంగా, మహా వైభవపేతంగా పలువురు గోండ్ చక్రవర్తులు ఖేర్ల,మాండ్లా,నాగపూర్,దేవఘర్,చంద్రపూర్,సిర్పూర్,జున్ గాం కేంద్రాలుగా తమ పరిపాలన కొనసాగించారు.ఆ సమయంలో జూన్ గాం రాజ్యాన్ని బీర్ షా పాలించేవాడు.సిర్పూర్ కోట నుండి జూన్ గాం కు మార్చి,ఆ తర్వాత బల్లాల్ షా చంద్రపూర్ నదికి దక్షిణం వైపు కొత్త రాజధాని నిర్మాణించాడు.ప్రస్తుతం ఆ నగరమే బల్లార్ షా పిలువుబడుతోంది.భీంబల్లాల్ షా గోండ్వానా రాజ్య విస్తరణలో భాగంగా పలు చోట్ల కొత్త నగరాలు నిర్మించాడు.కోటలు కట్టించాడు.మిగతా గోండ్ ఆదివాసీ వీరులను ఏకం చేసి స్వతంత్ర గోండ్వానా రాజ్యంగా విస్తరణ కృషి చేసాడు.ఆ సమయంలోనే రాజగోండ్ లు చిన్న చిన్న రాజ్యాలను,మండలాలను స్థాపించారు.ఆయా ప్రాంతాలలోని చిన్న చిన్న జ్యాలను,మండలాలను,కలిపి ఒక పెద్ద రాజ్యాన్ని పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసారు.అలాంటి రాజ్యాలే తాండూరు,ఉల్లిపిట్ట,కోట,పరందోలి,ఉట్నూర్,గోయెన,ఉండుంపూర్,మానిక్ ఘడ్,నార్నూర్,కోట రుద్రంపూర్, దేవదుర్గం మొదలైనవి.జున్ గాం రాజ్యంలో 16 చిన్న రాజ్యాలు,దేవదుర్గం క్రింద 6 రాజ్యాలు,9 మండలాలు, రాజుగా రాజ్యంలో 22 మండలాలు 8 మండలాలు, ఉట్నూరు క్రింద 6 రాజ్యాలు, 12 మండలాలు ఉండేవి.900 సంవత్సరాల క్రితం జున్ గాం అంటే అసిఫాబాద్ లోని దట్టమైన అడవులు, కొండలతో నిండి ఉండిన ప్రాంతం.ఇక్కడ మైదాన ప్రాంతం చాలా తక్కువ.కేరామేరి,ఝరి,జోడేఘాట్ కొండల్లో విస్తరించిన అలనాటి గోండ్ రాజ్యం దేవదుర్గం.దేవదుర్గం కింద సుమారు 180 గ్రామాల పాలన సాగేది.900 సంవత్సరాల క్రితం భీంబల్లాల్ షా ఇక్కడ పటిష్టమైన కోటను జున్ గాం లోని కంచు కోటకు కు దీటుగా 1600 అడుగుల ఎత్తైనా కొండపై శత్రు దుర్భేద్యంగా నిర్మించారు.దేవదుర్గం ఎత్తైన కొండ పై నిర్మించడం వల్ల శత్రు రాజులకు ఈ దుర్గాన్ని జయించాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పటికి ఈ కొండను చేరుకోవాలంటే చాలా కష్టం.అసిఫాబాద్ నుండి 32 కి.మీ.దూరంలోగల మొవాడ్ కు వెళ్ళి అక్కడి నుండి 12కి.మీ నడక ద్వారా అడవిలో ప్రయాణిస్తే ఈ కొండ వస్తుంది.కొండపైన వనదేవతకు దసరా సమయంలో 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు.కొండకు తూర్పు వైపున సవతుల గుండం జలపాతం ఉంటుంది.కొండపైకి ఎక్కితే అపూర్వమైన రీతిలో నిర్మించిన రాతికోట ఆనవాళ్ళు ఇప్పటికీ సజీవంహ సాక్షాలుగా మనకు దర్శనమిస్తాయి.దేవదుర్గం కోటని వోటేఘడ్ అని ప్రస్తుతం స్థానికులు పిలుస్తారు.16,17 శతాబ్దలలో గోండ్వానాలో ముస్లిం రాజుల దండయాత్రల దరిమిలా గోండ్ ప్రాంతంలో ముస్లింలు ప్రవేశించి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో కొంతమంది గోండ్ రాజులు చిర్రకుంట సమీపంలో సరికొత్త దేవదుర్గాన్ని, మరికొంతమంది గోండ్ రాజులు మానిక్ ఘడ్ నిర్మించి పాలన కొనసాగించారు.భీం బల్లాల్ షా తర్వాత గర్జన బల్లాలు సింగ్, హీర్ సింగ్,అండియా బల్లాలు సింగ్,తల్వార్ సింగ్,కేసర్ సింగ్,దినకర్ సింగ్, రామ్ సింగ్,సూర్జాబల్లాల్ సింగ్,ఖండ్యకా బల్లాల్ షా,హీర్ షా, భూమాలతో పాటు లోకాబా,కొండ్యాషా,బాబ్జీ ఫర్వాలేదు షా, దుండియా రాంషా, క్రిష్ణషా, బీర్ షా-2,రాంషా-2,నికంత్ షా చక్రవర్తుల పాలనలో 870 నుండి 1751 వరకు దేవదుర్గం రాజ్యాన్ని మడావి రాజులు అవిచ్ఛిన్నంగా పాలించారు.దేవదుర్గం కోటలో అక్కడక్కడా పడి ఉన్న రాతి శిలలు,కొన్ని గుర్తు పట్టలేని శిల్పాలు,రాతి దర్వాజాలు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.వివిధ కోటలపై పరిశోధనలు కొనసాగిస్తున్న చరిత్ర పరిశోధకులు తెలంగాణ రాష్ట్రంలో పరఢివిల్లిన గోండ్వానా కోటపై కూడా సమగ్ర పరిశోధన కొనసాగిస్తే ఎంతో ఆసక్తికరమైన గోండ్ ఆదివాసీ రాజుల చరిత్ర వెలుగులోకి వస్తుంది.భోపాల్ ను భోపాల్ షాసలం,నాగ్ పూర్ ను భక్త్ బులంద్ షా ఉయికె,రాయ్ పూర్ ను రాయిజగత్,ఛంద్రపూర్ ను ఖండక్య బల్లార్షా,హోషంగ్ బాద్ ను హోషంగ్ షా,జబల్ పూర్ ను మదన్ షా ఇలా పలు నగరాలను గోండ్ ఆదివాసీ రాజులు నిర్మించారు.చత్తీష్ ఘడ్ లో గోండ్ ఆస్థానాలు 1947 వరకు గోండ్ రాజుల పాలనలో ఉండేది. స్వాతంత్ర్యం అనంతరం ఆ ఆస్థానాలన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసారు.గోండ్వానా రాజ్యంకు గుర్తింపునిస్తూ భారత ప్రభుత్వం గోండ్వానా విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్రలో గడ్చిరోలిలో ఏర్పాటు చేసింది.భారత రైల్వే శాఖ జబల్ పూర్ హజ్రత్ నిజాముద్దీన్ గోండ్వానా ఎక్స్ ప్రెస్ పేరుతో రైలును నడుపుతుంది.జబల్ పూర్ యూనివర్సిటీని మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1984లో రాణి దుర్గావతి యూనివర్శిటీగా నామకరణం చేసారు.ఆమె మరణించిన తారీఖు గుర్తుగా 1988 జూన్ 24న భారత ప్రభుత్వం తపాలా బిళ్ళను విడుదల చేసింది.జబల్ పూర్ జమ్మితావి మధ్య నడిచే రైలుకు రాణి దుర్గావతి ఎక్స్ ప్రెస్ గా పేరు పెట్టడం జరిగింది.గోండ్ ఆదివాసీ రాజుల చరిత్రను భారత దేశ చరిత్రలో సమగ్రంగా లిఖించే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మొట్టడం రాజబాబు కోరారు.
