
:పయనించే సూర్యుడు: జూన్ 27: మక్తల్
గురువారం రోజు గోలపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ముంబాయి కు చెందిన వ్యాపారవేత్త వెంకటేష్ పూజారి , గ్రామాల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందడం కోసం ప్రభుత్వ పాఠశాలకు 20వేల రూపాయల విలువగల స్మార్ట్ టీవీ ని విరాళంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు శ్రీనివాస్ కి అందజేశారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధి జరుగుతుందని బడి ఈడు వయసుగల విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని తెలుపుతూ ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చిన పూజారి వెంకటేష్ ని మనస్ఫూర్తిగా అభినందించారు.అనంతరం మధ్యాహ్న భోజన తనిఖీ చేశారు.ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పేద విద్యార్థుల కోసం స్మార్ట్ టి.వి ఇచ్చిన వెంకటేష్ పూజారి కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీకాంత్, ఇందిరలు పాల్గొన్నారు.
