
( పయనించే సూర్యుడు మార్చ్ 29 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
పరిగి రోడ్డు వెహికల్ యూనియన్ అసోసియేషన్ కు చెందిన గోవింద్ నాయక్ అకాల మరణం చెందడం పట్ల మాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందనీ సంఘం పేర్కొంది. ఆయన కుటుంబానికి మనస్పూర్తిగా సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ధైర్యం కలిగించినట్టు పేర్కొన్నారు. యూనియన్ తరఫున గోవింద్ నాయక్ కుటుంబానికి ఆర్థిక సహాయంగా రూ. 20,000 అందజేయడం జరిగిందనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు గోపాల్, రవి, రమేష్, అయ్యప్ప రెడ్డి, సత్యం, గురు, సీతారాం, ఠాగూర్, మోహన్, రాష్ట్ర నరసింహులు, కృష్ణ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. గోవింద్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి మా యూనియన్ తరఫున అండగా ఉంటామని తెలియజేస్తున్నాము..