రుద్రూర్, అక్టోబర్ 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ రుద్రూర్ గోశాలకు బుధవారం రాత్రి 101 మోపుల గడ్డి వితరణ చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో NRI కోనేరు శశాంక్ చేస్తున్న సేవలు అభినందనీయమని బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


