
ఆవులకు టీకాలు వేస్తున్న దృశ్యం..
రుద్రూర్, ఏప్రిల్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని దేవిదాస్ రావు గోశాలలో ఆవులకు శుక్రవారం ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఇందులో భాగంగా 89 ఆవులకు టీకాలు వేయడం జరిగిందని పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గోశాల ప్రతినిధులు బచ్చురాం సెట్, ఇందూరు చంద్రశేఖర్, సతీష్, లైవ్ స్టాక్ అసిస్టెంట్ డి. సాయిరాజ్, పశు వైద్య సిబ్బంది గంగారాం, గోశాల సిబ్బంది పాల్గొన్నారు.