
గౌడ కులస్తుల పోరాటానికి బిఎస్పి అండగా ఉంటుంది.
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 16: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.
వాజేడు:బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం అధ్యక్షులు వాజేడు మండల ఇన్చార్జి కుమ్మరి రాంబాబు మాట్లాడుతూ, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న వీడీసీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,నిజామాబాదు జిల్లా, ఏర్గట్ల మండలం తాడ్ల రాంపూర్ గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా కుంకుమార్చన చెయ్యడానికి శ్రీ రాముని గుడిలోకి వెళ్లిన గౌడ కుల మహిళల ఆలయ బహిష్కరణ రాష్ట్రంలో ఒక సంచలనాన్ని రేపిందనీ ఈ ఘటనను బీఎస్పీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచల నియోజకవర్గ అధ్యక్షులు వాజేడు మండల ఇంచార్జి కుమ్మరి రాంబాబు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ బిఎస్పీ రాష్ట్ర నాయకులు తాళ్ల రాంపూర్ గ్రామ గౌడ కులస్తులను కలిసి జరిగిన విషయంపై గౌడ కులస్తులను కలిసి గౌడ స్త్రీల దేవాలయ బహిష్కరణ కు దారి తీసిన అంశాలను వివరంగా తెలుసుకున్నారనీ తెలిపారు. ఆ ప్రాంతాల్లో వీడీసీ ల పేరుతోటి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని అందులో భాగంగానే గౌడ మహిళలను రామాలయంలోకి రానీయకుండా అడ్డుకున్నారని ఇది అత్యంత దుర్మార్గమని అన్నారు. VDC(విలేజ్ డెవలప్మెంట్ కమిటీ) లు చట్ట వ్యతిరేకమైన తమ ఆగడాలను వెంటనే నిలిపివేయకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు VDC ల ఆగడాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ VDC లను రద్దు చేయాలని VDC లను రద్దు చేసే వరకు బీఎస్పీ పోరాటం చేస్తుందని, గౌడ కుల మహిళలకు జరిగిన అవమానం సామాజిక బహిష్కరణ పై, వారికి VDC ల వల్ల జరిగిన ఆర్థిక నష్టానికి, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పోలీస్ ఉన్నతఅధికార్లు స్పందించి నేరస్తులను వెంటనే అరెస్ట్ చేసి, భాధితులకు రక్షణ కల్పించాలి లేనియెడల కోర్ట్ ని ఆశ్రయించి భాధితులకు న్యాయం జరిగే వరకు బాధితులతో కలిసి BSP కూడా న్యాయ పోరాటం చేస్తుందనీ తెలియజేశారు. అంతేకాకుండా, ఆర్మూర్ డివిజన్ పరిధిలో VDC ల ఆగడాలను ప్రజలు ఇంకెంత మాత్రం భరించే స్థితిలో లేరని, వీరి ఆగడాలు పెచ్చుమీరి పోయి రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడిన స్థానిక ప్రభుత్వ ప్రతినిధులను ప్రక్కన పెట్టి, ప్రభుత్వానికి సమాంతరంగా, తమ ఇష్టానుసారంగా, నిరంకుశంగా VDC లు స్థానిక పరిపాలన కొనసాగించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.అందుకే VDC ల రద్దు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కలుపుకొని బీఎస్పీ పోరాటం చేస్తుందని, సామాజిక బహిష్కరణకు గురైన తాళ్ల రాంపూర్ గ్రామ గౌడ కులస్తుల పోరాటానికి బహుజన్ సమాజ్ పార్టీ వారికి అండగా నిలబడుతుందని బహుజన సమాజ హక్కులను కాపాడటంలో BSP నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.