
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13..యడ్లపాడు మండల ప్రతినిధి ..
ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పలనాడు జిల్లా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్, మౌజనులకు నిలిచిపోయిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారికి వినతి పత్రం అందించటం జరిగింది.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రేసిడెంట్ ,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపి రెడ్డి శ్రీనివాస రెడ్డి, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు పిఎస్ ఖాన్, స్టేట్ మైనార్టీ స్పోర్క్ పర్సన్ మరియు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు షేక్ దరియావలి, యడ్లపాడు మండల మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ హుజేఫా,మరియు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు…