
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సహకారంతో గ్రంథాలయాలకు మహర్దశ రూ. 2.కోట్లతో షాద్ నగర్ గ్రంధాలయాన్ని నిర్మించాం
షాద్ నగర్ మాజీ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీనరసింహారెడ్డి
( పయనించే సూర్యుడు జనవరి 21 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )… షాద్ నగర్ నియోజకవర్గంలో గత తొమ్మిదేళ్ల పాలనలో గ్రంథాలయాల అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ సహకారంతో ముందుకు సాగామని షాద్ నగర్ మాజీ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీనరసింహారెడ్డి వివరించారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు షాద్ నగర్ గ్రంథాలయాన్ని తాము నిర్మించినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని లక్ష్మీనరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకొని అనేక కష్టనష్టాలను భరించిన తమకు అప్పటి ప్రభుత్వంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గ్రంధాల అభివృద్ధి కోసం తమను అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఎంపిక చేశారని గుర్తు చేశారు. నాలుగు కోట్ల రూపాయలతో గ్రంథాలయ భవనాన్ని నిర్మించినట్టు తెలిపారు. అదేవిధంగా కొందుర్గులో ఉదాత సహకారంతో 671 చదరపు గజాల స్థలాన్ని సమకూర్చామని కోటి పైచిలుకు రూపాయలు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ నిధులు సరిపోవని మరికొన్ని నిధులు కావాలని అప్పటి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చెప్పడంతో అక్కడ పనులు జరగలేదని పేర్కొన్నారు. అదేవిధంగా కేశంపేట మండలంలో 10 లక్షల రూపాయలతో గ్రంథాల భవన మరమ్మత్తులు చేయించామని గుర్తు చేశారు. కొత్తూరు ఉమ్మడి మండల లో కూడా 98 లక్షలతో గ్రంథాలయ భవనాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. గ్రంథాలయాలకు గత ప్రభుత్వంలో మహర్దశ కల్పించింది తమ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా వివరించారు. అంతేకాదు అనేక రకాల పుస్తకాలతో పాటు ముఖ్యమైన పుస్తకాలను గ్రంథాలయాలకు సమకూర్చడం జరిగిందని అన్నారు. ఆనాడు తమ ప్రభుత్వం లో పాలమూరు జిల్లా జైలుకు ఖైదీల కోసం అనేక రకాల పుస్తకాలు అందజేయడం జరిగిందని దీనిపై అప్పటి డిజిపి ప్రత్యేకంగా స్థానిక గ్రంథాలయానికి అభినందనలు తెలిపారని గుర్తు చేశారు. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాలకు కూడా పుస్తకాలను గ్రంధాలయాల కోసం అందజేసిన ఘనత తమదైనని చెప్పుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రంథాలయాన్ని చందాలకు విరాళాలకు రియేటర్ల వద్ద ప్రసీదు బుక్కులు పట్టుకుని తిరిగిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక స్వయం ప్రతిపత్తిగా నిధులు సమకూర్చుకొని గర్వప్రదంగా గ్రంథాలయాలను నిర్వహించామని అన్నారు. గ్రంథాలయ నిర్మాణాల సమయంలో కాంట్రాక్టర్ నాసిరకం కట్టడాలు చేపడితే వెంటనే విజిలెన్స్ కు ఫిర్యాదు చేసి నాణ్యమైన భవనం నిర్మించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గత పది ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నా సరే గ్రంధాలయాలకు మహర్దశ కల్పించిన ఘనత బీఆర్ఎస్ నాయకులదేనని ఈ సందర్భంగా తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ గ్రంథాలయ కమిటీ సభ్యులు అందే మహేశ్వర్ గాదె సుధాకర్ అందే జంగరాజ్ అల్లాడ శేఖర్ గడ్డం ఆంజనేయులు మహమ్మద్ సలీం మాంకా జగన్ అబ్దుల్ రవుఫ్,నవిన్ తదితరులు పాల్గొన్నారు.