
గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్దాం టిడిపి నాయకులు
పయనించే సూర్యుడు న్యూస్/ సెప్టెంబర్ 16/ గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ నాయుడు
మండల పరిధి గంజిహళ్లి గ్రామంలో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సీనియర్ నాయకులు కృష్ణమ నాయుడు, గ్రామ టిడిపి అధ్యక్షుడు తలారి శ్రీనివాసులు గ్రామ కమిటీ సభ్యులు టిడిపి నాయకులు ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలో పలు సమస్యలపై చర్చించుకోవడం జరిగింది.పారిశుద్ధ సమస్యలపై
2.గ్రామ సమీపంలో 70 ఎకరాలు విస్తీర్ణం గల చెరువు కలదని గత ఏడు సంవత్సరాలుగా మీరు లేక వెళవేళ పోతుందని, గ్రామంలో ప్రతి సంవత్సరం శ్రీశ్రీశ్రీ మహాత్మ సద్గురు బడే తాత స్వామి ఉరుసు మహోత్సవానికి లక్షల్లో జనాభా హాజరవుతారన్నారు. ఆ సమయంలో తాగునీటికి తీవ్రమైన ఇబ్బంది నెలకొంటుందని ఈ సమస్య పరిష్కారానికి హంద్రీనీవా నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరును నింపకోవడం వలన త్రాగునీటి సమస్య కొరత తో పాటు చెరువులో నీరు ఉండడం భూగర్భ జలాలు పెరిగి కొన్ని వందల బోరుబావులకు నీటి సరఫరా అందిస్తుందని దానివలన త్రాగునీటికే కాకుండా రైతు వ్యవసాయ రంగానికి కూడా కలిసి వస్తుందని అందరి అభిప్రాయంతో తీర్మానించారు.గ్రామంలో కొన్ని కాలనీలో డ్రైనేజ్ సిసి రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, ప్రధానంగా ఎక్కడెక్కడ సమస్య ఉందో ఆ కాలనీ లో రోడ్లు డ్రైనేజీలకు,గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామానికి వస్తున్న ప్రధాన రహదారి ఎల్ఎల్సీ కాల్వ పై బ్రిడ్జ్ విస్తీర్ణం తక్కువ ఉండడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్న గ్రామ ప్రజలు, ఈ సమస్యను దృష్టిలో నూతన బ్రిడ్జ్ ఏర్పాటుచేసి వంకర టింకర్ గా ఉన్న రోడ్డును కూడా నేరుగా ఉండేటట్లు చేయడానికి ప్రతిపాదన పై తీర్మానాలన్నీ గ్రామ కమిటీ సమావేశంలో చేసుకోవడం జరిగిందని తెలిపారు.అనంతరం సీనియర్ నాయకులు కృష్ణమ నాయుడు మాట్లాడుతూ గ్రామములో టీడీపీ పార్టీ నాయకులు ఓకే కుటుంబంలా కలిసిమెలిసి మెలగాలని వర్గ విభేదాలతో పార్టీకి మచ్చ తేవద్దని నాయకులంతా ఐక్యతతో గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడాలని హితవు పలికారు.ఈ కమిటీ తీర్మానం సమావేశంలో గ్రామ కమిటీ సభ్యులు కురవ దరగయ్య, పెద్ద లక్ష్మన్న, షేక్షావలి స్వామి, దేవేంద్ర, మూగి వెంకటేష్, నల్లగండ్ల బడేసాబ్, బెస్త నాగేష్, సుధాకర్, నబి, పత్తేసాహెబ్, రాజశేఖర్, కిషోర్ నాయుడు, సురేష్ నాయుడు, నీలకంఠ, కాజా, వేణు,మహేష్, మలకన్నా, సభ్యులు పాల్గొని తీర్మానాలు చేశారు.