
పయనించే సూర్యుడు మార్చి 22 టేకులపల్లి ప్రతినిధి టేకులపల్లి ప్రతినిధి , పొనకంటి ఉపేందర్ రావు
టేకులపల్లి మండలం పెగ్గళ్ళపాడు గ్రామపంచాయతీ పరిధిలో శనివారం గ్రామపంచాయతీ పంచాయతీ సెక్రెటరీ సతీష్, స్థానిక మాజీ సర్పంచ్ రమాదేవి, కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ వేసవి కాలంలో మంచినీరు బాటసారులకు మరియు ప్రజలకు ఎంతో అవసరమని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ అంతోటి లీలాబాయ్, డి శ్రీనివాస్ చారి, కే సత్యనారాయణ, కే నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.