
పయనించే సూర్యుడు న్యూస్//ఆగస్టు 4// నారాయణ పేట జిల్లా బ్యూరో//
గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో డ్రగ్స్ గంజాయి మద్యానికి బానిస అవుతున్న యువత భవిష్యత్తును కాపాడాలని ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో నారాయణ పేట జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో CI (సర్కిల్ ఇన్స్పెక్టర్) శివశంకర్ గారిచే పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా CI శివ శంకర్, PYL రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దింటి రామకృష్ణ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో యువకులను డ్రగ్స్ , గంజాయి మద్యం విక్రయాల మూలంగా వాటికి బానిసలుగా మారి.విద్యార్థులు, యువకులు భవిష్యత్ పై ధ్యాస లేకుండ , జీవితం మీద బాధ్యత సమాజం పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా.ప్రవర్తిస్తున్నారని వాటిని కట్టడి చెయ్యాల్సి ఉన్నదని పాలకులు ,అధికారులు విచ్చిలవిడిగా అనుమతులు ఇవ్వడం మూలంగా దేశ భవిష్యత్ను కాపాడాల్సిన యువతరం నేడు అంధకారంలోకి నెట్టబడ్డారు. తమ కుటుంబంపై వారి జీవితాలపై ఏమాత్రం ధ్యాస లేకుండా ప్రజలను.బ్రాయబ్రాంతులకు గురి చేయడం వంటి అనేక సంఘటనలు ప్రతిరోజూ దర్శనం ఇస్తున్నాయి. అందుకని గ్రామీణ.మరియుపట్టణ ప్రాంతాల్లోని యువతి యువకులు డ్రగ్స్ గంజాయి మద్యం లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. వాటి నివారణ కొరకు విద్యార్థి యువకులు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని యువత భవిష్యత్తును కాపాడడం కోసం రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా యుకులను సమాజం పట్ల గౌరవ మర్యాదలు ఉండేటట్లు చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పిలుపిచ్చారు. వాటి నివారణకై ప్రభుత్వాలు, అధికారులు పర్యవేక్షణ చేయాలని కఠిన చట్టాలు అమలుచేసి వాటిని,నియంత్రించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నారాయణపేట CI శివశంకర్,PYL రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దింటి రామకృష్ణ, మరియు టౌన్ SI గాయత్రి మేడం, ప్రగతిశీల యువజన సంఘం (PYL) జిల్లా అధ్యక్షుడు ప్రతాప్, PYL ప్రధాన కార్యదర్శి సిద్దు, జిల్లా ఉపాధ్యక్షులు సలీం,అంజి, మల్లేష్ సహాయ కార్యదర్శి రాము, మధు, తిరుమలేశ్ ,కోశాధికారి గణేష్ జిల్లా నాయకులు కృష్ణ,యల్లప్ప, బాల్ రాజ్,శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
