Tuesday, April 22, 2025
Homeఆంధ్రప్రదేశ్గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేసేందుకు జనసైనికులు కృషి చేయాలి

గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేసేందుకు జనసైనికులు కృషి చేయాలి

Listen to this article

అంబేద్కర్ ఆశయాలతో జనసేన పార్టీ ముందుకు కొనసాగుతుంది: జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా యూత్ అధ్యక్షులు సాంబశివుడు

పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 21//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//

నారాయణపేట జిల్లా మఖ్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్ అధ్యక్షతన మఖ్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా యూత్ అధ్యక్షులు భైరపోగు సాంబశివుడు, సీనియర్ నాయకులు ముకుంద నాయుడు, ఉమ్మడి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి పి. ఆర్ రఘు, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా విద్యార్థి విభాగ్ కోఆర్డినేటర్ శరత్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలతో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు బడుగు,బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు జనసేన పార్టీని స్థాపించారని కావున ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త పార్టీ ఆశయాలను గ్రామస్థాయిలోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వారి కోరారు. ఈ నియోజకవర్గ ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నేటి జనసైనికులు ఆయా గ్రామాల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేసి ప్రజలకు అండగా నిలవాలన్నారు. ఈ మఖ్తల్ నియోజకవర్గ ప్రాంతంలో వివిధ పార్టీల నాయకులు యువకులను రాజకీయంలో తమ ఎదుగుదలకు స్వార్థంగా బానిసలుగా ఉపయోగించుకొని యువతను రాజకీయంగా ఎదగనివ్వడంలేదన్నారు. కానీ జనసేన పార్టీ అధినేత అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై ఎవరైతే పోరాటం చేసి ప్రజలకు అండగా నిలిచే యువకులకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చేందుకే జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం అన్నారు. జనసేన పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీ గుర్తిస్తూ పార్టీలో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. అందుకు ప్రతి జనసేనకుడు మఖ్తల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోకి జనసేన పార్టీ ఆశయాలను తీసుకువెళ్లి రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏదైనా ఒక ప్రాంతంలో విజయం సాధించేందుకు పాటుపడాలని జనసేన పార్టీ కార్యకర్తలకు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం మక్తల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ అధ్యక్షులు భైరపోగు సాంబశివుడు, సీనియర్ నాయకులు ముకుంద నాయుడు, ఉమ్మడి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి పి. ఆర్ రఘు, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా విద్యార్థి విభాగ్ కోఆర్డినేటర్ శరత్ గౌడ్, నియోజకవర్గ నాయకులు ఎండి సోపి,శ్యాంసుందర్, రామన్ గౌడ్, బల్ రెడ్డి, డాక్టర్ మోహన్ బాబు, ఆది కేశవులు, చిట్యాల శ్రీను, భీమేష్,గౌడి రవీందర్ రెడ్డి, టేకులపల్లి భీమేష్,అలాగే వివిధ గ్రామాలకు చెందిన జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments