
పయనించే సూర్యుడు జూన్ 13 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :బర్లగూడెం గ్రామపంచాయతీ నందు బర్లగూడెం-మొట్లగూడెం వరకు 10 లక్షల 98వేల రూపాయలతో చేపట్టిన గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా అంతర్గత రహదారుల నిర్మాణం కోసం,గ్రావెల్,బీ.టీ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు.పూర్తి నాణ్యతతో సకాలంలో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని గుత్తేదారుకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పీ.ఆర్ ఏ.ఈ నవీన్,బోడు ఎస్.ఐ శ్రీకాంత్,పంచాయతీ కార్యదర్శి రామ దేవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్, క్రాంతు,ప్రవీణ్,అంజి,శేఖర్ రాములు,జగపతి,కిషోర్,ఆరేళ్ల కుమార్,రమేష్, రావూరి సతీష్,రేఖా శివాజీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.