
పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
విద్యార్థులకు మొదలైన టెన్షన్ పార్ట్ టైం ఉద్యోగులను వెనక్కి పంపుతున్న ట్రంప్ హైదరాబాద్ ; యుఎస్ లో భారతీయులు ప్రశాంతంగా బ్రతికే పరిస్థితి లేదు. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రావడంతో భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి సంచలన నిర్ణయాలతో ముఖ్యంగా భారతీయులకు షాకిస్తున్నారు. అక్రమ వలసదారుల పైన కఠిన చర్యలు తీసుకుంటున్న ట్రంప్ సరైన డాక్యుమెంట్లు లేకుండా దేశంలోకి వచ్చిన వారిని దేశం నుండి పంపిస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా చేతులకు సంకెళ్ళు వేసి ప్రత్యేక విమానాలలో వారిని తరలిస్తున్నారు. రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్న ట్రంప్ అమెరికా పౌరులు మొదట అని తన నినాదాన్ని తెలిపిన ట్రంప్ వలసదారులను నియంత్రించే కార్యక్రమంలో భాగంగా రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. అమెరికా దేశానికి వెళ్లి చదువుకునే విద్యార్థులకు సైతం ట్రంప్ తీరు అశనిపాతంగా మారింది. పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా పట్టుకుంటే భారత్ కు తిప్పి పంపుతున్నారు. రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్న ట్రంప