
పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 9 రిపోర్టర్ కే.శివకృష్ణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో మెడికల్ & కల్చరల్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ,గృహ నిర్మాణ మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి,ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ,బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు,ఆంధ్రప్రదేశ్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు మరియు మహిళలు,తదితరులు పాల్గొన్నారు.