
అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్న దృశ్యం..
రుద్రూర్, ఏప్రిల్ 14 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల్లో సోమవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలన్నారు. అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.