
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని ఎయిర్ గట్ల మండల్
గ్రామం తాళ్ల రాంపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు….
ఏర్గట్ల మండలంలోని తాళ్ళ రాంపూర్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు, తొలి ,మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.పద్మశాలిసంఘ సభ్యులు కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలను కొనియాడారు. స్వాతంత్ర సాధనలో మరియు తెలంగాణ తొలి మలి దశ పోరాటంలో వారి రాజీలేని ఉద్యమస్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజాపూర్ణానందం, తాటికొండ గంగాధర్ మాజీ సర్పంచ్ భాను జిందం శాస్త్రి చిలువేరి మధు సంఘ సభ్యులు, పాల్గొన్నారు.