
విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర విస్తృత సమావేశం
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి జులై 7
ఈ రోజు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలోని జిఎంఆర్ స్మార్ట్ సెమినార్ హాల్ సైన్స్ అండ్ టెక్నాలజీ భవనము నందు ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహణలో డా,,టి. బాబురావు నాయుడు రిటైర్డ్ ఐ ఏ ఎస్, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ, (ఏపీ ఆదివాసీ జేఏసీ) రాష్ట్ర ఛైర్మెన్ రచించిన “ఉనికి కోల్పోతున్న ఆదివాసీలు” పుస్తకావిష్కరణ ఆదివాసీ జేఏసీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొపెసర్స్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఛైర్మెన్, పూర్వ సివిల్ సర్వీస్ సభ్యుడు డాక్టర్ టి.బాబు రావు నాయుడు మాట్లాడుతూ…ఉనికిని కోల్పోతున్న ఆదివాసీలు పుస్తకం గురించి వివరించారు. మనం ఐక్య కార్యాచరణ ప్రణాళిక ప్రకారం మరియు ఐక్య ఉద్యమాల ద్వారా నే ఆదివాసీ స్వయం పాలన రాష్ట్రం సాధనకు దగ్గర మార్గం అన్నారు. కావున ఆదివాసీ పోరాట యోధుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మరియు ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకుల ఉపన్యాసాల అనంతరం, చర్చించి భవిష్యత్ కార్యాచరణ పై తీర్మానాలు తీసుకున్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ రైట్స్ ఆఫ్ ఇండిజినియాస్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా మరియు మరికొన్ని తీర్మానాలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో చింతూరు డివిజన్ నుండి సెంట్రల్ కమిటీ నాయకులు మడివి నెహ్రూ, ఏ ఐ ఏ ఈ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కాక రాజు, డివిజన్ ఛైర్మెన్ జల్లి నరేష్, ఉయిక రాంప్రసాద్, పాయం రాజేష్, మడివి సాయి మరియు వివిధ జిల్లాల నుండి ప్రజా ప్రతినిధులు, సభ్య సంఘాల నాయకులు, మహిళలు, యువతీ యువకులు మొదలైన వారు పాల్గొన్నారు.
