
దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మత
40 వర్ధంతి కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎన్. రాజు
( పయనించే సూర్యుడు మే 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ : దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎన్. రాజు అన్నారు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఈరోజు. సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు శ్రీను నాయక్ అధ్యక్షతన జరిగిన పుచ్చలపల్లి సుందరయ్య 40.వ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సుందరయ్య జీవితం కేవలం ఒకే ప్రాంతాన్ని కాకుండా దక్షిణ భారతదేశమంతా కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరియ వ్యవసాయకార్మికులు కూలీలు రైతుల భూములు సమస్యలు ప్రజల సమస్యలు వారి జీవన విధానాలను మార్పు కొరకు సుందరయ్య ప్రజలందరినీ చైతన్యపర్చాడు అదే విధంగా దున్నే వాడికి భూమి కావాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని వందల ఎకరాలు పేదలకు పంచాడన్నాడు సుందరయ్య నెల్లూరు జిల్లాలోని అలాగానిపాడు లో జన్మించిన కామ్రేడ్స్ సుందరయ్య భూస్వామ్య కుటుంబంలో జన్మించి ఉన్న భూమిని పేదలకు పంచి నిరాడంబరంగా తన యొక్క జీవితాన్ని పేద ప్రజల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు కామ్రేడ్ సుందరయ్య అని కొనియాడారు. 20 ఏళ్ల పాటు పార్లమెంటు అసెంబ్లీలలో నిరంతరం ప్రజలన సమస్యల పైన భారతదేశ అభివృద్ధి పైన అనర్గళంగా మాట్లాడితే రాజకీయ పార్టీలకు అతీతంగా నెహ్రూ లాంటి వ్యక్తులే ప్రశంసించిన గొప్ప వ్యక్తి అని వారు అన్నారు ప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని వాటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతుకు భూమి లేకుండా చేయాలని కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోళ్లు తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని స్వతంత్ర కాలంలో సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు వడ్ల చంద్రమౌళి. ఆంజనేయులు గౌడ్. కావాలి రాజు. కుర్మయ్య. మహమ్మద్ బాబు తదితరులు పాల్గొన్నారు
