
అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ రి.నెం.717/1978
//పయనించే సూర్యుడు// ఆగస్టు 7//మక్తల్
అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్ ఆధ్వర్యంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి వర్ధంతి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ గద్దరన్న తన పాటలతో అంటరానితనానికి, దోపిడీకి వ్యతిరేకంగా అగ్రకుల అగ్రవర్ణ పెత్తందారులు,భూస్వాములు గ్రామాలు వదిలేసి పారిపోయేలా కష్టజీవుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించి, యుద్ధభేరి మేమోగించిన ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చిరస్మరణీయుడని కొనియాడినారు.తెలంగాణ సిద్ధాంతకర్తగా,జాతిపితగా పేరొందిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ అనే నినాదంతో నీళ్లు,నిధులు నియామకాలలో ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతానికి చేస్తున్నటువంటి అన్యాయం పట్ల తెలంగాణ ప్రజలను మేల్కొల్పి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగం చేశారన్నారు. కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా నేటి పాలకులు ఆంధ్ర పెత్తందారులకు కాంట్రాక్టులను కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా చుండూరు గగ్రామంలో అగ్రకులాల చేతుల్లో దళితుల ఊచకోతకు బలై నేటికి సరిగ్గా 34 సంవత్సరాలు ఐన సందర్భంగా దళిత మృత వీరులను స్మరించుకుంటూ ఆనాడు గద్దర్ దళిత పులులమ్మ కారం చెడు బుస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన అనే పాటతో కారంచేడు, చుండూరు దళితుల వీరత్వాన్ని, చైతన్యాన్ని అంటరాని వర్గాలకు,బలహీన వర్గాలకు అందించాడని, దాని కారణంగానే ఆనాడు దళితులకు రక్షణ కల్పిస్తూ వచ్చిన కఠినమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంను ఇపుడు కుట్రపూరితంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చాలా సులభంగా స్టేషన్ బెయిల్ ఇచ్చేలా నీరుగాడ్చిపడేస్తుందన్నారు.తన పాట ఎప్పుడు ప్రజల పక్షమే అని అమ్మ తెలంగాణమా ఆకలికేకల గానమా,పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ తెలంగాణ సమాజాన్ని ఉద్యమంలో భాగం చేసి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ను ఏర్పాటు చేసి నూతన ప్రజాస్వామిక తెలంగాణకై కృషి చేశారన్నారు.ఈ క్రమంలో రౌడీ పాలకుల కిరాయి గుండాల తూటాలు గుండెలో దిగిన వెరవకుండా జీవిత చరమంకం వరకు ప్రజల పక్షాన నిలబడిన నిక్కర్సైన నాయకుడు ప్రజా గాయకుడు గద్దరన్న అని కీర్తించారు.అంతేకాకుండా లాల్-నిల్ నినాదంతో బహుజన రాజ్యాధికార కాంక్షను ఆశించారని అందుకు తగ్గట్టు ఆయన బాటలో పయనించాలన్నారు.రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన అటవీ హక్కులను లెక్కచేయకుండా అక్కడున్న ఖనిజ సంపదను బహుళ జాతి కంపెనీలకు దోచి పెడుతున్నారని అందుకు అడ్డుపడుతున్న ఆదివాసీలను నక్సలైట్ల పేరుతో యదేచ్చగా చంపేస్తూన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, ఉపాధ్యక్షులు బ్యాగరి వెంకటేష్, సలహాదారులు పోలప్ప, కార్యవర్గ సభ్యులు అంజయ్య, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ మంద నరసింహ, జీర్గల్ నాగేష్,కేఎన్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న, జిల్లా నాయకులు విజయ్ కుమార్, బి.ఎస్.పి అసెంబ్లీ ఇన్చార్జి పాలెం వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి చంద్రశేఖర్, ఉప్పర్ పల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బాలా కిష్టయ్య, ఆర్టిఏ నాయకులు గొల్లపల్లి నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోలపల్లి నారాయణ, కర్రె మంజప్పా, జుట్ల అంజప్ప, బ్యాగరి సురేష్,అంబేద్కర్ యువజన సంఘం క్రియ శీలక సభ్యులు బ్యాగరి శ్రీహరి, గొల్లపల్లి నగేష్, కోరి రంజిత్, కర్రెమ్ మారుతి, శ్రీనివాస్, సురేష్,జగ్గలి రమేష్, సౌరం భాయ్ లింగప్ప, పుడమి ఫౌండేషన్ ఉపాధ్యక్షులు రవికుమార్, యూటీఎఫ్ మండల నాయకులు కఱ్ఱెం నాగేష్ టీచర్, కర్రేమ్ రాజు, జగ్గలి బాబు తదితరులు పాల్గొన్నారు.
