
పయనించే సూర్యుడు గాంధారి 06/03/25 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతంగల్ కలాన్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల విద్యార్థులతో కాంప్లెక్స్ స్థాయి TLM మేళాను పొతంగల్ కలాన్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాధికారి రాజు మేళాను ప్రారంభించి విద్యార్థులు బోధన అభ్యాస సామాగ్రి మరియు ప్రయోగాల ద్వారా విద్యా బోధన చేస్తూ శాస్త్రీయ వైఖరి అలవర్చుకొని భావిభారత శాస్త్రవేత్తలుగా తయారు కావాలని కోరారు.
విద్యార్థులు అందరూ ప్రతిరోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు నేర్పిన విషయాలను నేర్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పారు.
కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గన్నమనేని రంగారావు మాట్లాడుతూ కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు శాస్త్రీయ పరిజ్ఞానం అందించడానికి ఈ TLM మేళ ను నిర్వహించామని ఇక్కడ నేర్చుకున్న శాస్త్రీయ వైఖరులను తమ దైనందిక జీవితంలో వినియోగించుకొని జీవితం సుఖమయం చేసుకోవాలని , కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాల విద్యార్థులు తమకు అవసరం ఉన్నప్పుడు ఇక్కడి ల్యాబ్, IFP, ప్రొజెక్టర్లు ఉపయోగించుకొని నాణ్యమైన విద్యను పొందాలని కోరారు.. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్, శ్రీహరి ,రజని నాగవేణి ,సాయిన్న సంతోషి ,సంధ్య ,రాజ్ కుమార్, సాయి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.