
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 10
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతూరు నందు మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు విద్యార్ధులు బ్యాండు మేళాలతో, పుష్ప గుచ్చాలు ఇచ్చి ఆహ్వానం పలికి వారికి క్రీడా పోటీలు తల్లులకు రంగోలి, తండ్రులకు తగ్ ఆఫ్ వార్ నిర్వహించి బహుమతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ఎఎస్పీ శ్రీ పంకజ్ కుమార్ ఐ పి యస్ గారు మాట్లాడుతూ విద్యార్దులు డ్రగ్స్ బారిన పడకుండా సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని సూచించడం జరిగింది. అదే విధంగా విద్యార్ధులు అడిగిన సందేహాలకు సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పెంటమ్మ గారు మండల విద్యాశాఖ అధికారులు శ్రీ లక్ష్మీనారాయణ గారు, వెంకటేశ్వర్లు గారు సీఐ శ్రీ దుర్గాప్రసాద్ గారు , పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ ఆకుల వర నాగేంద్ర ప్రసాద్ గారు, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల విద్యార్ధులు పూర్వ విద్యార్థులు, దాతలు పాల్గొనడం జరిగింది.
